ఇక్ష్వాకు వంశానికి చెందిన శ్రీ రామ చంద్రుడు, ఈ భరత వర్షాన్ని అయోధ్య రాజధానిగా, ప్రజా రంజకంగా పరిపాలిస్తూ దుష్ట-శిక్షణ, శిష్ట -రక్షణ గావించినట్లు చరిత్ర, ఆ కాలాన్ని, ఆ రాజ్యాన్ని రామరాజ్యం అంటారు, అందుకు సాక్ష్యంగా గోత్ర ప్రవరలు మరియు క్షేత్రములు సజీవ సాక్ష్యంగా నిలిచాయి, ఆ కాలంలో ధర్మం నాలుగు పాదాలపై నడిచేదని, సామాన్యుల మాటకు కూడా విలువ వుండేదని సుముఖుల విశ్వాసం.
ధర్మ స్థాపనకై మరియు దుష్ట–శిక్షణ & శిష్ట–రక్షణ కొరకు మనము ఏర్పాటు చేసుకున్న న్యాయ/పోలీసు వ్యవస్థలు దుష్ట–శిక్షణ మాని, దుష్ట రక్షణ చేస్తున్నాయి, తప్పు చేసే వారిని రక్షించడం కోసమే అన్నట్టు పోలీసు మరియు న్యాయ వ్యవస్థలు పోటీ పడుతున్నాయి, సామాన్యులు నాయస్థానాలు గడప తొక్కే పరిస్తితి లేదు, అప్పో–సప్పో చేసి న్యాయ వాదికి ఫీజు చెల్లించి, కోర్టు చుట్టూ తిరిగినా ఎప్పటికి న్యాయం జరుగుతుందో తెలియదు, పూర్వ కాలంలో హిరణ్యకశిప & రావణాదులకు వరములు అనెడి రక్షణ కవచములు ఉన్నట్టు, ఇప్పుడు న్యాయ మూర్తులు మరియు పోలీసులకు సెక్షన్ 77 ఐపిసి, న్యాయ మూర్తులు రక్షణ చట్టం, భారత రాజ్యాంగములోని అధికరణం 124 (4) మరియు సెక్షన్ 197 CrPC రక్షణ కవచాలను కలిగి ఉన్నారు.
పూర్వ కాలంలో రావణ, హిరణ్యకశిపాదుల వరములు అనబడే రక్షణ కవచాలను ఛేదించి దుష్ట–శిక్షణ, శిష్ట–రక్షణ చేసిన శ్రీహరి సాక్షిగా, ఇప్పుడు దుష్ట–శిక్షణ, శిష్ట–రక్షణకి ఆటంకంగా మారిన అన్యాయ మూర్తుల రక్షణ కవచాలు ఛేదించి ధర్మ స్థాపన చేసెడి వ్యవస్థే"రామ రాజ్యం".
ప్రతి జిల్లా, మండలం, గ్రామంలలోని పూజారి మరియు పురోహితులు రామరాజ్యం స్థాపన, పనితీరు మరియు ప్రాముఖ్యత గురించి సామాన్య ప్రజలకు అవగాహన కల్పించే భాద్యతను కలిగి ఉంటారు .
రామ రాజ్యం స్థాపనకు మూలం/పునాది ఏది?
క్రిష్ణ గీతలోని అధ్యాయం 4లో 7 & 8 శ్లోకములు మరియు అధ్యాయం 18లో 17 & 43 శ్లోకములు.
రామ రాజ్య స్థాపనకు ప్రమాణం ఏమిటి ?
రామాయణంలో ఇక్ష్వాకు మరియు కుశ వంశాల ప్రస్తావన, మహాభారతములో భరత వంశం గురించి ఇచ్చిన స్పస్టత మరియు గోత్ర, క్షేత్రములు రామరాజ్య స్థాపనకు ప్రమాణం. ఇక్ష్వాకు వంశం (వశిష్ట, కౌండిన్య, కశ్యప గోత్ర క్షత్రియ ప్రవరలు) మరియు భరత వంశాల (దనంజయ గోత్రం, క్షత్రియ ప్రవర) వారసులు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు మరియు త్రేతా యుగము నాటి రామరాజ్యం ఉనికిలో ఉన్నప్పుటి నుండి ఈ రోజుకి కూడా వారి వారసులు తరతరాలుగా జీవించారనడానికి నిదర్శనం ఈ గోత్రాలు .
రామ రాజ్యం ద్వజము ?
వివాధ వికృతి గాంధారం అనెడి గరుడ ద్వజమ్
రామ రాజ్యం శంఖము ?
పంచమ ప్రకృతి స్వరము అనెడి పాంచ జన్యము.
రామ రాజ్య ధనుస్సు ?
ఆరు నొక్క స్వరముల వర రాగము
స్వరాoధ్రము సాక్షిగా విల్లు కాని విల్లు (ఆరు నొక్క స్వరముల కోదండము) నారి కాని నారి (నాగుల గోత్రము/కాశ్యప నాగ ప్రవర) శరము కాని శరము (ద్వాదశ స్వర స్థానములు మరియు వివాద వికృతి స్వరములు) రామ రాజ్యం వశము అయినందున కలిలో కలిబందనము సాధ్యం .
అన్యాయ మూర్తులు మరియు వారిచే ప్రేరేపించ బడే పోలీసులు.
సెక్షన్ 197 CrPC కి మరియు న్యాయ మూర్తుల రక్షణ చట్టానికి విరుగుడు సెక్షన్ 43 CrPC
సెక్షన్ 77 IPC కి సెక్షన్ 52 IPC విరుగుడు,
ఆర్టికల్ 124 (4) కి విరుగుడు ఆర్టికల్ 361 లో సజీవంగా ఉన్న రాజ ప్రముఖాస్త్రం .